ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హోలీ ( మార్చి 25) రానే వచ్చింది. దేశమంతటా ఘనంగా జరుపుకునే హోలీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. హోలీ రోజు రకరకాల రంగులతో తడిసి ముద్దయిపోవాలని, ఆనందంగా, కేరింతలతో ఆడుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. హోలీ రోజు తల నుండి పాదాల వరకు రంగులు అంటుకుంటాయి. ఇలా రంగులతో ఆడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్పే మాట. సహజ రంగులతో ఎలాంటి ప్రమాదం లేదు. కానీ రసాయన రంగులతో అసలు సమస్య. అవి కళ్లలో పడితే సమస్యలు వస్తాయి. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. హోలీ రోజు కళ్లను ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో.. ఒకవేళ కళ్లల్లో రంగులు పడితే ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హోలీ రోజు కళ్లు జాగ్రత్త
- 1. హోలీ రోజు కళ్లద్దాలు, సన్ గ్లాసెస్ ధరించండి. దీని వల్ల రంగులు కళ్ళల్లో పడకుండా ఉంటాయి.
- 2. కళ్లల్లోకి రంగులు పడకుండా జాగ్రత్త పడండి.
- 3. హోలీ ఆడటానికి ముందు కళ్ల చుట్టూ కొబ్బరి నూనె రాసుకోవడం మర్చిపోవద్దు. ఇలా రాసుకోవడం వల్ల రంగులు కళ్లల్లోకి వెళ్లకుండా నూనె అడ్డుకుంటుంది
కళ్లల్లో రంగులు పడితే ఏం చేయాలి
- 1. కంటిలో రంగులు పడగానే మంటగా, దురదగా ఉంటుంది. అందుకే చాలా మంది కంట్లో రంగులు పడగానే చేతితో రుద్దుతూ ఉంటారు. ఇలా అస్సలే చేయొద్దని కంటి వైద్యులు చెబుతున్నారు.
- 2. కళ్లల్లో రంగులు పడగానే శుభ్రమైన తాగే నీటితో కళ్లు కడుక్కోవాలి. మొదటి చేతులు శుభ్రం చేసుకుని కళ్లను కడుక్కోవాలి.
- 3. గ్లాసు నిండా కొద్దిగా చల్లని నీటిని తీసుకుని అందులో కళ్లు పెట్టి తెరుస్తూ, మూయాలి. ఇలా చేయడం ద్వారా కళ్లల్లోని రంగులు తొలగిపోతాయి.
- 4. కంటిలో రంగులో పడటం వల్ల దురద, మంట ఉంటుంది. కళ్లను శుభ్రంగా కడిగినా కొద్ది సేపటి వరకు అలాగే ఉంటుంది.
- 5. కళ్లు పొడిబారినట్లు అనిపించినా, చికాకుగా ఉన్నా.. ఐ డ్రాప్స్ వేసుకోవడం మంచిది.
- 6. ఇంకా సమస్య అలాగే ఉంటే కంటి వైద్యుని వద్దకు వెళ్లడం మంచిది
హోలీ రోజు కంటి ఇన్ఫెక్షన్ కు కారణాలు
- 1. హోలీ రోజు ఉపయోగించే సింథటిక్ రంగుల్లో లే వంటి భారీ లోహాలు ఉండొచ్చు. వాటి వల్ల పింక్ ఐ, కార్నియల్ రాపిడి, కెమికల్ బర్న్, బ్లంట్ ఐ ఇంజూరీ లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి సింథటిక్ రంగులను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడొద్దు.
- 2. హోలీ రోజు వాడే గ్రీన్ సింథటిక్ కలర్స్ అంధత్వానికి కారణమవుతాయి. దీని వల్ల ఉన్నట్టుండి కంటి చూపు కోల్పోతారు.
- 3. వాటర్ బెలూన్స్ కంటిపై తగిలితే వాటి వల్ల కళ్లు మొద్దుబారిపోతాయి. వాటర్ బెలూన్లను ముఖంపై కొట్టడాన్ని నివారించాలి.
- 4. రంగుల్లో ఉండే షైనింగ్ మైకా పార్టికల్స్ వల్ల కార్నియాకు హాని జరుగుతుంది.
- 5. హోలీ ఆడేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లో లెన్స్ ధరించకూడదు. హోలీ రంగులు కంటికి, లెన్స్ కు మధ్య చిక్కుకుని ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.